గూగుల్ ట్రెండ్ నెం1 లో సన్నీలియోన్

238
Sunny leone

శృంగార తారగా అందరికి పరిచయం ఉన్న సన్నీ లియోన్ కొద్ది రోజుల నుంచి బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటిస్తోంది. సన్నీ పలు సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. దీంతో ఆమెకు సినిమాల్లో హీరోయిన్ గా కూడా అవకాశాలు వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా సన్ని లియోన్ కు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇదిలా ఉండగా సన్నీలియోన్ మరోసారి గూగుల్ సెర్చ్ లో అగ్రస్థానాన్ని అందుకుంది.

బాలీవుడ్ ప్రముఖ హీరోలైన సల్మాన్, షారుఖ్, అమీర్ ఖాన్ లను రికార్డును తిరగరాసింది. ఇండియా గూగుల్ ట్రెండ్ లో సన్నీలియోన్ పేరు అత్యధికంగా సెర్చ్ చేస్తున్నట్లు ఆ సంస్ధ తెలిపింది. గతేడాది సన్నీలియోన్ టాప్ 10 స్ధానంలో ఉండగా ఈసారి ఏకంగా నంబర్ వన్ స్ధానాన్ని కైవసం చేసుకుంది.

సన్నీలియోన్ కి సంబంధించిన వార్తలు, ఆమె కుటుంబ సభ్యులు, వీడియోలు, బయోపిక్ చిత్రం కరణ్ జీత్ కౌర్ కోసం నెటిజన్లు గూగుల్ లో తెగ సెర్చ్ చేస్తున్నారట. ఇక ఈ విష‌యంపై స‌న్నీ లియోన్‌ను మీడియా ప్ర‌శ్నించ‌గా.. త‌న అభిమానులు త‌న‌ను ఇంత‌టి స్థానంలో నిలిపినందుకు వారికి రుణ‌ప‌డి ఉంటాన‌ని ఆమె తెలియ‌జేసింది. ఇండియాలోనే తానను నెంబర్ 1 ప్లేస్ లో ఉంచినందుకు అభిమానులకు ధన్యవాదలు తెలిపింది.