బన్నీ సుకుమార్ మూవీ అప్ డేట్స్..

186
Allu Arjun Sukumar

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈమూవీకి అల..వైకుంఠపురంలో అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇటివలే ఈటైటిల్ కు సబంధించిన ప్రోమోను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈమూవీలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డె హీరోయిన్ గా నటిస్తోంది. ఈమూవీని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

ఇక ఈమూవీ తర్వాత అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఇప్పటికే సుకుమార్ పూర్తి కథతో సిద్దంగా ఉన్నాడు. తాజాగా ఉన్న సమాచారం ప్రకారం అక్టోబర్ 3న ఈమూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలను చేయనున్నారని తెలుస్తుంది.

అక్టోబర్ 15 నుంచి రెగ్యులర్ షూటింగును ప్రారంభించనున్నట్లు సమాచారం. నెలాఖరు వరకూ ఫస్టు షెడ్యూల్ షూటింగును నిర్వహిస్తారు. ఆ తరువాత అల్లు అర్జున్ కొంత గ్యాప్ తీసుకుని, ‘అల వైకుంఠపురములో’ షూటింగును పూర్తిచేస్తాడట. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిన తరువాత పూర్తి సమయాన్ని సుకుమార్ సినిమాకే కేటాయిస్తాడని చెబుతున్నారు. ఇక వీరిద్దరి కాంబినేషన్ ఆర్య, ఆర్య2 సినిమాలు రాగా అవి ఘన విజయాన్ని సాధించాయి. మరో సారి ఈ క్రేజీ కాంబినేషన్ లో మూవీ రానుండటంతో బన్నీ అభిమానులు హ్యాపిగా ఫీలవుతున్నారు.