సాహో చేసి తప్పుచేశానా: సుజీత్‌

338
sahoo

భారీ అంచనాల మధ్య ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చిన మూవీ సాహో. ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్‌ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు సుజీత్ స్పందించారు. సాహో సినిమా తీసి తప్పు చేశానా అని ప్రశ్నించారు.

సినిమా చూడటానికి ఎందరో ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చినప్పటికీ తాను బాధితుడిగా మిగిలిపోయానని చెప్పారు. తనపై ఇంత దారుణంగా కామెంట్లు చేయడానికి తానేమీ నేరం చేయలేదంటూ బాధపడ్డారు. రూ.350 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లు రాబట్టిందని…. తనపై వస్తున్న వార్తలన్నీ తనను ఎందకూ పనికిరానివాడిగా ఫీలయ్యేలా చేస్తున్నాయన్నారు.నాపై వస్తున్న ఈ నెగిటివిటీని తట్టుకోలేక ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నాను’ అని చెప్పుకొచ్చారు సుజీత్.

టాక్‌తో పని లేకుండా ఈ చిత్రం 10 రోజుల్లోనే 400 కోట్లు రాబట్టిందని యువీ క్రియేషన్స్ తెలిపింది.