ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు అసలు కారణం ఇదే..!

264
student suicides
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ మార్కుల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో 20 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తూ వస్తున్నాయి. ప్రతిపక్షాలు దీన్ని ప్రభుత్వ వైఫల్యం అని ఆరోపిస్తుండగా.. ప్రభుత్వం మాత్రం ఇందులో తమ ప్రమేయం ఏమీ లేదని చెబుతోంది.

అయితే ఈ వివాదంపై ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ తాజాగా వివరణ ఇచ్చారు. ఆత్మహత్యకు పాల్పడిన ఇంటర్ విద్యార్థుల మార్కుల విషయంలో ఎలాంటి పొరబాట్లు జరగలేదని స్పష్టం చేశారు. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థుల పేపర్లను రీవెరిఫికేషన్ చేశామని ఆయన వెల్లడించారు. ఒక విద్యార్థినికి 85 శాతం మార్కులు వచ్చినా ఆత్మహత్య చేసుకుందని, మరో విద్యార్థిని అన్ని సబ్జెక్టులు పాసైనా బలవన్మరణం చెందిందని వివరించారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకల వల్లే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారనేది వాస్తవం కాదని అశోక్ అన్నారు.

ప్రస్తుతం రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ తదితర ప్రక్రియలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ నెల 10వ తేదీన ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు. ఫలితాల వెల్లడి తర్వాత 15రోజులకు స్కాన్ చేసిన జవాబు పత్రాలను అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ఎలాంటి తప్పులు దొర్లకుండా అన్నీ సరిచూసుకున్న తర్వాతే ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు.

- Advertisement -