హీరోగా జబర్ధస్త్‌ స్టార్‌ కమెడియన్‌..

25
Sudigaali Sudheer

జబర్దస్త్, ఢీ, పోవే పోరా వంటి సూపర్ హిట్ టెలివిజన్ షోస్ ద్వారా ఎంతో పాపులర్ అయిన సుడిగాలి సుధీర్‌ హీరోగా,’రాజు గారి గది’ ఫేమ్‌ ధన్యా బాలకృష్ణ హీరోయిన్‌గా శేఖర ఆర్ట్‌ క్రియేషన్స్‌ బ్యానేర్‌ పై ప్రొడక్షన్‌ నెం-1గా ప్రముఖ పారిశ్రామిక వేత్త కె. శేఖర్‌ రాజు నిర్మిస్తున్న ఫుల్‌ లెంగ్త్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’.

Sudigaali Sudheer

ఈ సినిమా ద్వారా రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రముఖ నటి ఇంద్రజ, షాయాజీ షిండే, పోసాని కృష్ణ మురళి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈ సినిమాను జులై చివరి వారంలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Sudigaali Sudheer

ఈ సందర్భంగా హీరో సుడిగాలి సుధీర్‌ మాట్లాడుతూ – ”అందరూ నన్ను హీరో అంటున్నారు.. కానీ ఈ సినిమాకు కథే హీరో. దర్శకుడు ఈ సినిమా కథ చెప్పగానే చాలా ఎక్సయిటింగ్‌ గా అనిపించింది. ఇప్పటి వరకూ ఆడియన్స్‌ నన్ను తమ పక్కింటి కుర్రాడిగానే పరిగణిస్తారు. ఇంత తక్కువ టైంలోనే వారి ఆదరాభిమానాలు పొందడం నిజంగా నా అదృష్టం. అలాంటిది ఈ సినిమా ద్వారా వారికి మరింత దగ్గర అయ్యే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నా మొదటి సినిమాకే ఇంత మంది ప్రముఖ టెక్నిషియన్స్‌తో కలిసి పని చేస్తానని కలలో కూడా అనుకోలేదు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్‌” అన్నారు.