నాని…’వి’ లో పోలీస్‌గా సుధీర్‌..!

434
nani sudheer babu
- Advertisement -

నేచుర‌ల్ స్టార్ నాని, హీరో సుధీర్‌బాబు, అదితిరావు హైద‌రి, నివేదా థామ‌స్ హీరో హీరోయిన్లుగా శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ తెరకెక్కుతున్న చిత్రం `వి` . ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శిరీష్‌, ల‌క్ష్మ‌న్‌, హ‌ర్షిత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో సుధీర్ బాబు కీలకపాత్ర పోషిస్తుండగా అమిత్ త్రివేది మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో వి మూవీలో తన పాత్రపై క్లారిటీ ఇచ్చారు సుధీర్ బాబు.

ట్విట్టర్ వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ అభిమానులతో పంచుకున్నారు. తాను ఈ చిత్రంలో పోలీస్ పాత్ర చేయనున్నారని తెలిపారు. ఇప్పటికే హీరో నాని “వి” చిత్రంలో నెగటివ్ షేడ్స్ ఉండే సీరియల్ కిల్లర్ గా కనిపిస్తాడని వార్తలు వస్తున్న తరుణంలో సుధీర్ పోలీస్ పాత్రపై ఆసక్తి నెలకొంది. కాబట్టి కిల్లర్ నానిని వెంటాడే పోలీస్ గా సుధీర్ పాత్ర ఉండబోతుందని అర్థం అవుతుంది.

- Advertisement -