సుధాకర్ పైప్స్… మీలా సత్యనారాయణ కన్నుమూత

327
sudhakar pipes

స్వాతంత్ర సమరయోధుడు, విలువలకు ప్రాధాన్యతనిచ్చే సుధాకర్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఇండిస్టీస్‌ చైర్మన్‌ మీలా సత్యనారాయణ ఇక లేరు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్ర పొందుతూ మృతి చెందారు. మీలా సత్యనారాయణ ఆకస్మిక మరణం పట్ల మంత్రి జగదీష్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మీలా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. సూర్యపేట మున్సిపల్ చైర్మన్ గా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. సూర్యాపేటకు మీలా ఒక ఐకాన్ అని అభివర్ణించారు. స్వాతంత్ర్య సమర యోధునిగా ఆయన అందించిన స్ఫూర్తి అజరామరమని కొనియాడారు. సుధాకర్ పివిసి పైప్స్ అధినేతగా సూర్యపేటను పారిశ్రామికంగా తీర్చిదిద్దారని, మీలా లేని లోటును పూడ్చలేమని పేర్కొన్నారు.

ఉపాధ్యాయుడిగా తన జీవనం ప్రారంభించినప్పటికీ ఆ తరువాత మేటి విలువలతో వ్యాపారవేత్తగా, పారిశ్రామికవేత్తగా ఎదిగారు. దక్షిణ భారతంలో ప్లాస్టిక్‌ ఇండిస్టీ నిలబడేందుకు గాను ఆయన ఎనలేని కృషి చేశారు. ఉత్తమ ప్రమాణాలతో నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తూనే సామాజిక హితానికి కృషి చేస్తున్నందుకు గాను సత్యనారాయణకు విజయరత్న , హెచ్‌ఎంఏ స్మాల్‌స్కేల్‌ ఎంటర్‌ప్రీన్యూర్‌ అవార్డు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వపు ఉత్తమ పరిశ్రమ అవార్డు ,ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉత్తమ పారిశ్రామికవేత్త అవార్డులు లభించాయి.