అల్లు అర్జున్ ‘ఫాల్కన్’ అదుర్స్…. ధర ఎంతో తెలుసా?

345
Allu-Arjun-Falcon-Carawan
- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ఈసినిమా షూటింగ్ ప్రస్తతం హైదరాబాద్ లో జరుగుతంది. ఈమూవీలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డె హీరోయిన్ గా నటిస్తోంది. ఇక అల్లు అర్జున్ తాజాగా ఒక కొత్త క్యారీవ్యాన్ ను కొనుక్కున్నారు. దానికి ఫాల్కన్ అనే పేరు కూడా పెట్టారు. అన్ని సౌకర్యాలున్న ఆధునిక వ్యానిటీ వ్యాన్ సొంతంగా డిజైన్ చేయించుకున్నాడు.

అల్లు అర్జున్ ఈ బస్సు కోసం ఏకంగా రూ.6కోట్లు ఖర్చు పెట్టాడంట. సినిమా షూటింగ్ మధ్యలో విశ్రాంతి తీసుకోడానికి, మేకప్ వేసుకోడానికి, ఇతరత్రా అవసరాల కోసం ఈ బస్సును వాడతాడు. ఇందులో బెడ్, సోఫా, కుర్చీలు, వాష్ బేషిన్ వంటివి ఉంటాయి. తాజాగా ఈ వ్యానిటీ వ్యాన్‌కు సంబంధించిన ఫోటోలను అల్లు అర్జున్ సోషల్ మీడియాలో షేర్ చేసాడు. అంతేకాదు అభిమానుల అండదండలు, ఆశీర్వాదాలతోనే నేను ఇవన్ని కొనుక్కోగలిగాను అంటూ ట్వీట్ చేసాడు.

- Advertisement -