దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై విద్యార్థినుల హర్షం..

279
disha

దిశ హత్యాచార కేసు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడంపై దేశవ్యాప్తం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దేశ వ్యాప్తంగా విద్యార్థినులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నలుగురు నిందితులకు సరైన శిక్ష విధించారని విద్యార్థినులు పేర్కొంటున్నారు. విద్యార్థినుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిస్తుంది. నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేశారని తెలుసుకున్న విద్యార్థినులు.. దిశ ఆత్మకు శాంతి చేకూరిందని పేర్కొంటున్నారు.

తమకు న్యాయం జరిగిందని విద్యార్థినులు విజయ సంకేంతం చూపుతున్నారు. విద్యార్థినులు పోలీసులకు మిఠాయిలు తినిపిస్తున్నారు. తెలంగాణ పోలీసులకు విద్యార్థినులు శుభాకాంక్షలు చెప్పడంతో పాటు సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ ఉదయం దిశ హంతకులను సీన్ రీకన్ స్ట్రక్షన్ కోసం తీసుకు వెళ్లిన సమయంలో వారు పోలీసులపై దాడికి దిగి పారిపోతుంటే, ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే.

Students Express Happy Over Disha Incident Accused Encounter..Students Express Happy Over Disha Incident Accused Encounter..