గ్రామాల అభివృద్ధికి అందరూ కలిసి పని చెయ్యాలి..

179

రాజేంద్రనగర్‌లోని టీఎస్ఐఆర్డీలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజేశం గౌడ్ ఆధ్వర్యంలో సర్పంచ్ లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హాజరైయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యంగా గ్రామపంచాయతీల బలోపేతంపై చర్చ జరిగింది.

ఈ సంర్భంగా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ..గ్రామాల్లో సర్పంచ్‌లకు చాలా పవర్ ఉంటుంది.సర్పంచ్‌లు ఊరును ఏ విధంగా అభివృద్ధి చేయాలని తపన పడతారు.ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి ఎన్నో ఆలోచనలు చేస్తున్నారు.కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వనున్న సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధి ఏ విధంగా అభివృద్ధి చెయ్యాలో చెప్పారు.రాబోయే రోజుల్లో మన ఊర్లు అన్ని మన ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లు ఆలోచన చెయ్యాలి.ప్రతి గ్రామంలో పరిశుభ్రంగా ఉంచాలి,హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించాలి అని గ్రామ సర్పంచ్‌లకు సీఎం కేసీఆర్ చెప్పారు.

ప్రతి ఒక్కరు హరితహారం కార్యక్రమంలో పాల్గొనేలా చెయ్యాలి.మిషన్ భగీరథ ద్వారా ప్రతి గ్రామంలో నీళ్లు వస్తున్నాయి దీనితో మీకు సగం బాధ పోయింది.స్థానిక ఎమ్మెల్యేతో పనులు చేయించుకోవాలి.చాలా మంది మహిళలు ఇప్పుడు సర్పంచ్‌లు అయ్యారు. మహిళ సర్పంచ్ పట్టుదలతో పని చేస్తారు.ప్రజలకు సేవ చెయ్యాలి.సీఎం కేసీఆర్ ముందు చూపుతో రాష్ట్రం ముందుకు పోతుంది.గతంలో ఎన్నికలు అయితే గ్రామాలకు పోయే పరిస్థితి లేదు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది.రాష్ట్ర అభివృద్ధికి మీ నుండి సాధ్యం అవుతుంది.ప్రజల మద్దతుతో గెలిచాం ప్రజలకు సేవ చెయ్యాలి అని ఎమ్మెల్యే అన్నారు.

రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజేశం గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో గ్రామపంచాయతీల బలోపేతానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు.30 రోజుల ప్రణాళికలో అందరూ సర్పంచ్‌లు భాగస్వామ్యం కావాలి.గ్రామాలను పంచదనం పరిశుభ్రం చెయ్యాలి,కేంద్ర ప్రభుత్వం నుండి ఎన్ని నిధులు వస్తున్నాయో తెలుసుకోవాలి.గ్రామ సర్పంచిగా గ్రామాన్ని అభివృద్ధిలో ముందు వరుసలో ఉంచి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపాలి.ఊర్లో ప్రతి ఒక్కరు మొక్కలు నాటలి అందుకు కార్యాచరణ రూపొందించాలి.

గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రాలు అభివృద్ధిలో ఉంటాయి.15వ ఆర్ధిక సంఘం నిధులు ఇచ్చేలా సీఎం కేసీఆర్ లేఖ రాశారు.సీఎం కేసీఆర్ గ్రామాలను అభివృద్ధి పరిచేలా అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నారు.పంచాయితీలలో వంద శాతం పన్నులు వసూలు చెయ్యాలి.ఇప్పటికే రాష్ట్రంలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్లు వస్తున్నాయి.గ్రామాల అభివృద్ధికి అందరూ కలిసి పని చెయ్యాలని రాజేశం గౌడ్‌ అన్నారు.