బిగ్ బాస్ 3 ప్రోమో.. హోస్ట్ ఎవరో తెలుసా?

151
Bigboss3

బుల్లితెరపై ప్రసారమయ్యే బిగ్ బాస్ షో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. తెలుగులో విజయవంతంగా రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈషో త్వరలోనే మూడవ సీజన్ లో ప్రారంభంకాబోతుంది. ఇందుకు స్టార్ మా ఛానల్ వారు అధికారికంగా ప్రోమో ను విడుదల చేశారు. జులై చివర్లో లేదా ఆగస్ట్ మొదటి వారంలో ఈషోను ప్రారంభించనున్నట్లు తెలస్తుంది.

హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ 3 సెట్టింగ్ ను కూడా రెడీ చేశారు. ఈ దఫా బిగ్‌ బాస్‌ మరింత కొత్తగా సాగుతుందని ప్రోమోను చూస్తే తెలుస్తోంది. హౌస్ లో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవరెవరన్న విషయమై ఇంకా ప్రకటన వెలువడాల్సివుంది. దానికి సంబంధించిన ఓ అనఫీషియల్ లిస్ట్‌ ఇప్పటికే సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది.

కామన్‌ మ్యాన్‌ కు ఈ సీజన్ లో ఎంట్రీ లేదని సమాచారం. హోస్ట్ గా నాగ్ పనిచేయనున్నారన్న వార్తలపైనా అధికారిక సమాచారం తెలియాల్సివుంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం నాగార్జున ఈసీజన్ కు హోస్ట్ గా చేయనున్నారని తెలుస్తుంది. నాగార్జున గతంలో మీలో ఎవరూ కోటిశ్వరుడు చేసిన అనుభవం ఉండటంతో నిర్వాహకులు ఆయన వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తుంది.