శంక‌ర్ ‘భార‌తీయుడు2’లో కాజ‌ల్..

276
kajal shankar
- Advertisement -

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శంక‌ర్, సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ 2.ఓ. ఈరోజే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈమూవీ కి అన్ని ప్రాంతాల‌నుంచి విశేష స్పంద‌న వ‌స్తోంది. మొద‌టి రోజే ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న రికార్డుల‌న్ని తిర‌గ‌రాశారు. ప్రిమియ‌ర్ షో టాక్ చూస్తే బాక్సాఫిస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తోంది.ఈసినిమా ప‌క్కాగా ఘ‌న‌విజ‌యం సాధిస్తుంద‌నే విజ‌యంతో ఉన్నాడు ద‌ర్శ‌కుడు శంక‌ర్.

2.o

శంక‌ర్ త‌ర్వాతి మూవీ క‌మ‌ల్ హాస‌న్ తో భార‌తీయుడు2 చేయ‌నున్నాడు. ఈసినిమాకు సంబంధించిన సెట్స్ ను హైద‌రాబాద్ రామోజీఫీల్మ్ సిటీలో వేస్తున్నారు. ఈమూవీని ఎక్కువ‌గా తెలుగు రాష్ట్రాల్లోనే షూటింగ్ జ‌రుప‌నున్న‌ట్లు తెలుస్తుంది.

bharatiyuduu

తాజాగా వ‌స్తున్న వార్త‌ల ప్ర‌కారం ఈచిత్రం రెగ్యూల‌ర్ షూటింగ్ డిసెంబ‌ర్ 14నుంచి ప్రారంభంకానుంద‌ని తెలుస్తుంది. ఈమూవీలో కమ‌స్ హాస‌న్ స‌ర‌స‌న హీరోయిన్ గా కాజ‌ల్ ను తీస‌కున్న‌ట్లు తెలుస్తుంది. చిత్ర‌యూనిట్ మాత్రం అధికారికంగా ప్ర‌క‌టించ‌క‌పోయినా క‌న్ఫామ్ అయిన‌ట్టే అని అంటున్నారు సినీ వ‌ర్గాలు.

- Advertisement -