స్టాలిన్‌తో సీఎం కేసీఆర్‌..మర్యాదపూర్వక భేటీనే:డీఎంకే

469
stalin ktr
- Advertisement -

తమిళనాడు పర్యటనలో భాగంగా డీఎంకే చీఫ్ స్టాలిన్‌తో సీఎం కేసీఆర్ ఇవాళ భేటీ కానున్న సంగతి తెలిసిందే. సాయంత్రం 4 గంటలకు స్టాలిన్ నివాసంలో వీరిద్దరు భేటీ కానున్నారు. వీరిద్దరి భేటీపై రకరకాల ఊహాగానాలు వెలువడుతున్న తరుణంలో డీఎంకే నేతలు క్లారిటీ ఇచ్చారు.

స్టాలిన్‌తో సీఎం కేసీఆర్ భేటీ మర్యాదపూర్వక భేటీనే అని డీఎంకే అధికార ప్రతినిధి సరవణన్ తెలిపారు. అయితే ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే పనిలో ఉన్న తెలంగాణ సీఎం ఇప్పటికే శరవేగంగా పావులు కదుపుతున్నారు.

ఈ నెల 23న ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత దేశరాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలే కీలక పాత్ర పోషించనున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ పార్టీలే తమవద్దకు వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసేవిధంగా ముందుకుసాగుతామనే ప్రతిపాదనను స్టాలిన్‌ వద్ద ఉంచనున్నారు కేసీఆర్.

అయితే ప్రస్తుతం స్టాలిన్‌..కాంగ్రెస్‌ కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్నారు. రాహుల్‌ ప్రధాని కావాలని ప్రతిపాదించిన ఏకైక వ్యక్తి కూడా స్టాలినే. ఈ నేపథ్యంలో కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం రాబోతుందనే వార్తలు వెలువడుతన్న నేపథ్యంలో కేసీఆర్,స్టాలిన్ భేటీ రాజకీయవర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

- Advertisement -