రామ్‌చరణ్‌కు రాజమౌళి వార్నింగ్‌..!

529
ramcharan
- Advertisement -

ప్రస్తుతం టాలీవుడ్ దృష్టంతా ఎస్ఎస్ రాజమౌళి భారీస్థాయిలో తెరకెక్కిస్తున్న  ‘RRR’ చిత్రంపైనే ఉంది. టాలీవుడ్ లో ప్రస్తుతం భారీ క్రేజీ ప్రజెక్ట్ ఇదే. ఈ సినిమాలో రామ్ చరణ్.. ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకు ఎన్టీఆర్ మొదటి నుంచి పూర్తిస్థాయిలో సమయం కేటాయించారు. సినిమా ప్రారంభం నుంచి ఇప్పటివరకూ మరో పని పెట్టుకోలేదు. కానీ చరణ్ మాత్రం మొదటి నుంచి పూర్తి స్థాయిలో సమయం కేటాయించలేకపోయారు.

rrr

ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. గతేడాది ఎండింగ్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ ప్రారంభం అయ్యింది. ఆ సమయంలో చరణ్ ‘వినయ విధేయ రామ’ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు చెర్రీ. అది కంప్లీట్ అయ్యాక.. ఆయన తండ్రి ప్రతిష్ఠాత్మకంగా భావించిన ‘సైరా’ చిత్ర నిర్మాణ బాధ్యతలు బుజానికి ఎత్తుకున్నాడు. దీంతో చరణ్‌కు క్షణం తీరిక లేకుండా పోయింది. ఆ చిత్రం రిలీజయ్యి, ప్రమోషన్స్ అయ్యేవరకు చెర్రీ అంతా తానై వ్యవహరించాడు.

ఇక ఏ పనులు లేవు..ఫుల్‌గా ‘ఆర్‌ఆర్‌ఆర్’ కోసం పనిచేస్తాడనుకుంటున్న టైమ్.. మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాను లాంచ్ చేశారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి చరణ్ కూడా ఒక నిర్మాత. దీంతో రాబోయే రోజుల్లో చరణ్ బిజీగా ఉండనున్నాడు. దీంతో రాజమౌళి..’ఆర్‌ఆర్‌ఆర్’పై దృష్టిపెట్టాలని చరణ్‌కు చిన్న వార్నింగ్ ఇచ్చాడట. మరి చరణ్ ఛేంజ్ అవుతాడో, లేదో చూడాలి.

- Advertisement -