లక్ష్మీపార్వతి పాత్రలో శ్రీరెడ్డి..?

361
Srireddy
- Advertisement -

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో, కొన్నాళ్ల క్రితం తాను ప్రకటించిన ‘లక్ష్మీస్‌ వీరగ్రంథం’ చిత్రం నిర్మాణం పనులను కూడా దర్శక నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి వేగవంతం చేస్తున్నారు. తన సినిమాలో ప్రధాన పాత్రను శ్రీరెడ్డి పోషించనున్నట్టు కేతిరెడ్డి తాజాగా ప్రకటించారు. కాగా ఎన్‌టీఆర్‌ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశానికి ముందు జరిగిన అంశాలతో తాను ‘లక్ష్మీస్ ‘వీరగ్రంథం’ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ప్రకటించారు. అయితే రాంగోపాల్‌ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం నిలిపేస్తే తానూ ‘లక్ష్మీస్ ‘వీరగ్రంథం’ నిలిపేస్తానని, ఆయన విడుదల చేస్తే తానూ విడుదల చేస్తానని కూడా కేతిరెడ్డి గతంలోనే స్పష్టం చేశారు.

Srireddy

ఇక ‘కాస్టింగ్ కౌచ్‌’ విషయమై గతంలో శ్రీరెడ్డి చేసిన పోరాటం అందరికీ తెలిసిందే. ఆ సమయంలో శ్రీరెడ్డికి రామ్‌గోపాల్ వర్మ మద్దతుగా నిలిచాడనే టాక్ రావటం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ప్రత్యేకంగా చెప్పుకోవల్సిన పనిలేదు. అయితే అప్పుడు జరిగిన పరిణామాలే ఇప్పుడు శ్రీరెడ్డికి ప్లస్ అవుతున్నాయని తెలుస్తోంది. ‘లక్ష్మీస్ వీరగ్రంథం’లో శ్రీరెడ్డికి ప్రధాన పాత్ర అవకాశం ఇవ్వడానికి అవే కారణమని నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అంటున్నారు. ఇప్పటికే శ్రీరెడ్డితో చెన్నైలో సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన వెల్లడించారు. త్వరలోనే ‘లక్ష్మీస్‌ వీరగ్రంథం’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభానికి కేతిరెడ్డి సన్నాహాలు చేస్తున్నారు.

- Advertisement -