క్షేమంగా ఢిల్లీకి తెలుగు విద్యార్ధులు

527
srinagar nit
- Advertisement -

జమ్మూ కశ్మీర్‌ లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో శ్రీనగర్‌ నిట్‌లో ఉన్న విద్యార్థులను ఖాళీ చేసి స్వస్థలాలకు వెళ్లాలని కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యార్ధులు ఆందోళన చెందుతూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ట్వీట్ చేశారు..

దీంతో వెంటనే స్పందించిన కేటీఆర్‌ ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్‌ వేదాంతం గిరికి విద్యార్థులు క్షేమంగా స్వస్థలాలకు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించగా ఆయన స్పందించారు.

నిట్ విద్యార్థులతో మాట్లాడిన ఆయన ఎలాంటి భయాందోళన చెందవద్దని విద్యార్థులకు భరోసా ఇచ్చారు. సురక్షితంగా స్వస్థలాలకు చేర్చే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. శ్రీనగర్ నిట్ లో సుమారు 150 మంది తెలుగు విద్యార్థులు ఉండగా రెండు రోజుల క్రితమే సెలవులు ముగిసి క్యాంపస్ కు చేరుకున్నారు విద్యార్థులు. కేంద్రం ఆదేశాలతో క్యాంపస్ నుండి జమ్మూ రైల్వే స్టేషన్ వరకు రవాణా సౌకర్యం కల్పించింది నిట్. ఈరాత్రికి జమ్మూ చేరుకోనుండగా వారందరికీ జమ్మూ నుండి ఢిల్లీకి రవాణా సదుపాయాలు ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం.

ktr delhi

- Advertisement -