నేడు భద్రాద్రిలో రాములోరి కళ్యాణం..

514
Seeta Rama Kalyanam
- Advertisement -

కరోనా ప్రభావంతో భక్తులు లేక భద్రాద్రి బోసిపోయింది. రామయ్య పెండ్లి కూడా కరోనా ఆటంకం ఏర్పడింది.. వైరస్ విస్తరణకు సామాజిక దూరం పాటించడమే శరణ్యం కావడంతో నిరాడంబరంగా జగదబిరాముని కళ్యాణం జరిగితోంది. 4 వందల ఏళ్లులుగా భక్తల జయజయ ధ్వానాల నడుమ అంగరంగ వైభవం జరిగే రాములోరి కళ్యాణంలో ఈసారి భక్తులకు అనుమతి లేదు.

minister indrakaran reddy

శ్రీసీతారాముల కల్యాణోత్సవాన్ని గురువారం నిరాడంబ‌రంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆల‌య అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్ప‌టికే దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి భ‌ద్ర‌చ‌లంకు చేరుకున్నారు.

ఆలయ ప్రాంగణంలోని బేడా మండపంలో కల్యాణోత్సవ వేడుకలు జరగనున్నాయి. శ్రీ సీతారామచంద్రులకు ప్ర‌భుత్వం త‌ర‌పున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముత్యాల తలంబ్రాలు, ప‌ట్టువ‌స్త్రాలను స‌మ‌ర్పిస్తారు.

- Advertisement -