కన్నులపండువగా శ్రీరామ పట్టాభిషేకం..

155
sri rama navami

శ్రీరామనవమి సందర్భంగా భద్రచాలం శ్రీసీతారామచంద్ర స్వామి పట్టాభిషేకం కన్నుల పండువగా జరిగింది. ఆదివారం మిథిలా ప్రాంగణంలో మేళతాళాల నడుమ సీతారాములు కళ్యాణం అంగరంగవైభవంగా జరుగగా ఇవాళ శ్రీరామ పట్టాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టాభిషేక మహోత్సవానికి భారీగా భక్త జనం తరలిరాగా గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు స్వామివారికి పట్టు వస్ర్తాలు సమర్పించారు.

విశ్వక్సేన ఆరాధనతో పట్టాభిషేకం మహోత్సవం ప్రారంభం కాగా పవిత్ర నదీ జలాలతో స్వామివారికి అభిషేకం జరిపి అష్టోత్తర, సహస్రనామార్చన, సువర్ణ పుష్పార్చన గావించారు. అభిజిత్‌ ముహూర్తంలో మధ్యా హ్నం 12 గంటలకు రజిత సింహాసనంపై సీతారామచంద్రస్వామి పట్టాభిషిక్తుడయ్యారు.

శ్రీరాముడికి పట్టాభిషేకం నిర్వహించే సమయంలో రామదాసు చేయించిన ఆభరణాలను ధరింపజేయడం ఆనవాయితీ.స్వర్ణఛత్ర, స్వర్ణపాదుక, రాజ దండ, రాజపట్ట, రాజముద్ర, సామ్రాట్‌ కిరీటం ఇలా ఒక్కో ఆభరణాన్ని భక్తులకు చూపిస్తూ, వాటి విశిష్టతను తెలుపుతూ స్వామివారికి అలంకరించారు.