మేడమ్ టుస్సాడ్స్‌లో కొలువుదీరిన శ్రీదేవి…

490
sri devi

ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ లో కొలువుదీరింది శ్రీదేవి. సింగపూర్‌లో జరిగిన శ్రీదేవి మైనపు విగ్రహా ఆవిష్కరణ వేడుకలో బోనీ కపూర్‌తో పాటు శ్రీదేవి కూతుళ్లు జాన్వీ,ఖుషి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫోటోలు దిగారు. అచ్చం వెండితెర జాబిలిని మైమరిపించేలా ఈ విగ్రహాం ఉండగా భువి నుంచి దిగికి మళ్లీ శ్రీదేవి వచ్చిందా అనిపించేలా ఉంది.

ప్రాంతాలకు అతీతంగా అభిమానులను సంపాదించుకుంది శ్రీదేవి. పుట్టింది తమిళనాడులో అయిన తన నటనతో ఎక్కడికి వెళ్లిన తమ ఇంట్లో మనిషే భావన కలిగించింది. అర్ధశతాబ్దం పాటు భారతీయ సినీ పరిశ్రమను ఏలిన అందాల జాబిలి నాలుగు తరాల స్టార్ హీరోలందరితోనూ నటించిన హీరోయిన్‌గా రికార్డు సృష్టించింది.

ఇక మేడమ్ టుస్సాడ్స్‌లో కొలువుదీరిన వారిలో బాలీవుడ్ నుండి అమితాబ్, హృతిక్, ఐశ్వర్య, షారుక్, మాధురి దీక్షిత్ ఉండగా టాలీవుడ్ నుండి కేవలం మహేష్, ప్రభాస్ మాత్రమే ఈ అరుదైన గౌరవం అందుకున్నారు.