ఐపీఎల్‌..నోబాల్‌ అంపైర్

495
noball
- Advertisement -

ఐపీఎల్ 2020కి రంగం సిద్ధమవుతోంది. ఐపీఎల్‌‌ 13వ సీజన్‌‌కు సంబంధించి డిసెంబర్‌‌ 19న ఆటగాళ్ల వేలం జరగనుండగా ఈ సారి కోల్‌కతాలో ఆక్షన్ జరగనుంది. . ప్రతి ఫ్రాంచైజీకి రూ. 85 కోట్లు చొప్పున కేటాయించారు. గతేడాది కంటే ఇది మూడు కోట్లు ఎక్కువ.

ఇక ఈ సారి నిబంధనలను సడలించిన ఐపీఎల్ యాజమాన్యం నోబాల్ కోసం ప్రత్యేక అంపైర్‌ని పెట్టాలనే నిర్ణయం తీసుకుంది.అంపైర్ల తప్పుడు నిర్ణయాలు కొన్నిసార్లు మ్యాచ్‌‌ ఫలితాన్ని మార్చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌‌ గవర్నింగ్‌‌ కౌన్సిల్‌‌ నోబాల్‌‌ అంపైర్‌‌ ను తెరపైకి తెచ్చింది. బ్రిజేశ్‌‌ పటేల్‌‌ నేతృత్వంలో మంగళవారం జరిగిన కౌన్సిల్‌‌ సమావేశంలో ఈ విషయంపై నిర్ణయం తీసుకున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే సీజన్‌‌లో ఈ విధానాన్ని అమలు చేస్తాం అన్నారు.

క్రికెట్‌‌ ప్రపంచంలోనే సంచలనం సృష్టించిన పవర్‌‌ ప్లేయర్‌‌ రూల్‌‌ను మాత్రం ఐపీఎల్‌‌ గవర్నింగ్‌‌ కౌన్సిల్‌‌ వాయిదా వేసింది.

- Advertisement -