పేదవారి సొంతింటి కళను నెరవేరుస్తాంః స్పీకర్ పోచారం

443
Pocharam
- Advertisement -

బాన్సువాడ నియోజకవర్గం వర్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈసందర్బంగా స్పీకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చాకే వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గాల నియామకాలలో కూడా రిజర్వేషన్లను తీసుకు రావడం జరిగిందన్నారు.

బాన్సువాడ నియోజకవర్గం ప్రధానంగా వ్యవసాయ ఆధారితం.నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఎకరాకు ఏటా రెండు పంటలకు పుష్కలంగా సాగునీరు అందించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు పలు పథకాలకు అనుమతులు మంజూరు చేశారు.వచ్చే ఏడాది నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్ళను హల్ధి వాగు ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టులోకి తరలిస్తాం.

అదేవిధంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా ప్రస్తుతం ఉన్న అలీసాగర్ ప్రాజెక్టు వెనుక జలాలపై రూ. 150 కోట్లతో ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేయడం ద్వారా నిజాంసాగర్ ప్రధాన కాలువలో డిస్ట్రిబ్యూటర్ నంబర్-28 వరకు నీళ్ళు అందుతాయి.దీనితో నిజాంసాగర్ తో సంబందం లేకుండా సుమారు70,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది.రూ. 100 కోట్లతో జాకోర, చందూర్ ఎత్తిపోతల పథకాల ద్వారా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని మెట్ట ప్రాంతాలలోని సుమారు 10,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది.

మంజీర నదిపై 4 చెక్ డ్యాంల నిర్మాణానికి కూడా అనుమతులు మంజూరు అయ్యాయి.త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ పథకాలకు శంకుస్థాపన చేస్తారు.రాష్ట్రంలోనే అత్యధికంగా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో మొత్తం 6000 రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం జరుగుతుంది.బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో మొత్తం 15,000 ఇళ్ళను నిర్మించి ప్రతి పేదవారి స్వంత ఇంటి కలను నేరవేరుస్తామని చెప్పారు.

- Advertisement -