శాసనసభ నిర్వహణకు తగు భద్రత ఏర్పాట్లు చేయాలి-పోచారం

261
Speaker Pocharam
- Advertisement -

గురు,శుక్ర రెండు రోజులు జరిగే శాసనసభ, శాసనమండలి ప్రత్యేక సమావేశాల నిర్వాహణపై పోలీసు శాఖ అధికారులతో రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ రోజు శాసనసభ లోని స్పీకర్ చాంబర్‌లో నిర్వహించిన ఈ ప్రత్యేక సమావేశంలో శాసనసభ నిర్వహణకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగినంత మంది పోలీసు శాఖ సిబ్బందిని నియమించాలని పోచారం శ్రీనివాస రెడ్డి సూచించారు.

Speaker Pocharam

శాంతిభద్రతల పరిరక్షణతో పాటు శాసనసభ పరిసరాలలో వాహనదారులకు, సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగు ఏర్పాట్లు చేయాలని స్పీకర్ సూచించారు. పోలీసు శాఖ తరుపున తీసుకుంటున్న చర్యలను ఆ శాఖ ఉన్నతాధికారులు వివరించారు.

శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, శాసనసభ డిప్యూటీ చైర్మన్ టి. పద్మారావు గౌడ్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, శాసనసభ కార్యదర్శి డా. నరసింహా చార్యులు, హాం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాజీవ్ త్రివేది, DGP మహేందర్ రెడ్డి, హైదరాబాద్ పోలీసు కమీషనర్ అంజనీ కుమార్ ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

- Advertisement -