రాజీనామాలపై స్పీకర్‌దే తుది నిర్ణయం:సుప్రీం

159
Supreme-Court

కర్నాటక రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్‌దే తుది నిర్ణయమన్నారు. రాజీనామాలపై స్పీకర్ నిర్ణయం తీసుకునే వరకు అసెంబ్లీకి హాజరుకావాలా వద్దా అనేది ఎమ్మెల్యేల ఇష్టమన్నారు.

రేపు బలపరీక్షకు ఎమ్మెల్యేలు హాజరుకావాలని ఎవరు బలవంత పెట్టలేరని అభిప్రాయపడింది. ఈ వ్యవహరంపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ని కోరలేమని తెలిపింది న్యాయస్ధానం.

సుప్రీంకోర్టు తీర్పుతో జేడీఎస్-కాంగ్రెస్ పార్టీల్లో ఆందోళన నెలకొంది. రెబల్స్ రాజీనామా ఆమోదిస్తే సంకీర్ణ సర్కార్ కుప్పకూలడం ఖాయం. ఒకవేళ రెబల్స్ సభకు రాకున్నా బలపరీక్షలో ప్రభుత్వం పడిపోతుంది. మొత్తంగా కన్నడ ఎపిసోడ్ కు రేపటితో తెరడపనుంది.