క‌రోనా వైర‌స్ తో స్పెయిన్ యువ‌రాణి మృతి

246
- Advertisement -

క‌రోనా మ‌హామ్మారి యావ‌త్ ప్రంపంచాన్ని భ‌య‌పెడుతుంది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ వైర‌స్ 199 దేశాల్లో విజృంభిస్తోంది. ఇటలీ, స్పెయిన్ లో క‌రోనా కేసులు అత్య‌ధికంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. స్పెయిన్ యువ‌రాణి మారియ థెరీసా క‌రోనాతో బాధ‌ప‌డుతున్న విష‌యం తెలిసిందే. తాజాగా స్పెయిన్ యువ‌రాణి మృతి చెందిన‌ట్లు తెలిపారు ఆమె కుటుంబ‌స‌భ్యులు. వచ్చే శుక్రవారం మాడ్రిడ్‌లో ఆమె అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు ప్రకటించారు.

స్పెయిన్ లో రోజు రోజుకి క‌రోనా బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు స్పెయిన్ లో 73 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. 5,982 మంది మృతి చెందారు. మ‌రోవైపు బ్రిట‌న్ ప్ర‌ధానికి కూడా కరోనా సోకింది. ప్ర‌స్తుతం ఆయ‌న స్వీయ‌నిర్భందంలో ఉన్నారు. ఇండియాలో కూడా క‌రోనా బాధితుల సంఖ్య పెరుగుతుంది. ఇప్ప‌టివ‌ర‌కు 1000మందికి పైగా క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు గుర్తించారు అధికారులు.

- Advertisement -