మోదీ ప్రమాణ స్వీకారానికి సోనియా..!

82

నరేంద్రమోదీ ప్రమాణస్వీకారం గురువారం రాత్రి రాష్ట్రపతి భవన్‌లో అంగరంగ వైభవంగా జరగనుంది. విదేశాల అధినేతలు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, భాజపా అగ్రనేతలు ఇలా చాలా మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఇక మోదీ ప్రమాణస్వీకారానికి యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ హాజరవుతున్నారు. అంతేకాదు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ హాజరవుతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలి నుంచి సోనియా గాంధీ విజయం సాధించగా.. రాహుల్‌ అమేథిలో ఓడి వయనాడ్‌లో గెలిచారు.

Sonia Gandhi

ఈ ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాజీనామా చేయగా.. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) తిరస్కరించిన విషయం తెలిసిందే. పార్టీ అధ్యక్షుడిగా ఆయనే కొనసాగాల్సిందిగా పార్టీ ముఖ్యనేతలు పట్టుబడుతుండగా రాహుల్‌ మాత్రం విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మోదీ ప్రమాణస్వీకారానికి ఆయన హాజరవుతుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.