గోవాలో సోనియా సైకిల్ రైడ్‌…

219
Sonia holidays in Goa
- Advertisement -

సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సేవలందించిన 71ఏళ్ల సోనియాగాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలను కుమారుడు రాహుల్‌ గాంధీకి అప్పగించిన సంగతి తెలిసిందే. క్రిస్మస్ వేడుకల అనంతరం ఈ నెల 26న సోనియా గోవాకు వెళ్లి అక్కడి ఓ రిసార్టులో రిలాక్స్ అవుతున్నారు.

గోవా బీచ్‌లో సోనియా గాంధీ సైకిల్‌ తొక్కుతూ నవ్వుతున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది ఇప్పుడు వైరల్‌ అయింది. సోనియా సైకిల్ తొక్కుతుండగా ఆమెతో సెల్ఫీ దిగేందుకు అక్కడివారు ఎంతో ఆసక్తి చూపారు. న్యూ ఇయర్ వేడుకల అనంతరం ఆమె తిరిగి ఢిల్లీ వెళతారని గోవా కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

సోనియా విశ్రాంతి తీసుకుంటున్నవేళ పార్టీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన రాహుల్‌ పలు కార్యక్రమాలతో బీజీ అయ్యారు. పార్టీ వ్యవస్ధాపక దినోత్సవం సందర్భంగా ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన బీజేపీ టార్గెట్‌గా విమర్శల దాడి పెంచారు.

- Advertisement -