దేశ యువతపై గుండాల దాడి:జేఎన్‌యు ఘటనపై సోనియా

181
sonia gandhi

జేఎన్‌యులో విద్యార్ధులపై జరిగిన దాడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ప్రముఖులు ఇప్పటికే జేఎన్‌యు ఘటనను ఖండించగా తాజాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ స్పందించారు.

దేశంలోని యువ‌త గొంతును ప్ర‌భుత్వం నొక్కి వేస్తుంద‌ని …దేశ యువ‌త‌పై గూండాలు దాడి చేస్తున్నార‌ని సోనియా ఆరోపించారు. మోడీ ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌ను ఖండిస్తున్నామ‌ని, ఇది అమోదయోగ్యం కాద‌న్నారు.

జేఎన్‌యూలో జరిగిన ఘటనను అంధ్య విద్యార్థి సూర్యప్రకాశ్‌ మీడియాకు వెల్లడించాడు. తాను జేఎన్‌యూలో పీహెచ్‌డీ చేస్తున్నాను. నినాదాలు చేసుకుంటూ క్యాంపస్‌లోకి దుండగులు ప్రవేశించారు. అప్పటికే తన రూమ్‌ లాక్‌ వేసి ఉంది. తన గదిని ఓపెన్‌ చేయాలని వారు గట్టిగా అరిచారు. గదికి ఉన్న కిటికీలను పగులగొట్టారు. ఒక గ్లాస్‌ ముక్క వచ్చి తన తలకు తాకిందన్నారు. ఈ సమయంలో తాను తీవ్ర భయాందోళనకు గురయ్యాను అని బాధిత విద్యార్థి సూర్యప్రకాశ్‌ చెప్పారు. భయానక వాతావరణంలో చదువుకోలేమని అంధ విద్యార్థి స్పష్టం చేశారు.