శంషాబాద్‌లో డొమెస్టిక్‌ ఫ్లైట్స్‌ ప్రారంభం..

311
somesh kumar
- Advertisement -

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో డోమెస్టిక్ ఫ్లైట్స్ ప్రారంభమయ్యాయని చెప్పారు సీఎస్ సోమేశ్ కుమార్. ప్రయాణీకుల ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకున్నామని…ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరి చేశామని తెలిపారు.

ప్యాసింజర్ ని టచ్ చేయకుండా సెన్సార్ లు ఏర్పాటు చేశామని…ఇప్పటికి వరకు వచ్చిన ఎవరికి కూడా కరోనా లక్షణాలు లేవు అన్నారు. ఇవాళ 19 ఫ్లైట్ హైదరాబాద్ కు రావడం మరో 19 ఫ్లైట్స్ హైదరాబాద్ నుండి ఇతర రాష్ట్రాలకు వెళ్లడం జరుగుతుందన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ప్రకారం అన్ని చర్యలు తీసుకున్నామని….సెక్యూరిటీ పరంగా,ఆరోగ్య పరంగా ఎయిర్‌పోర్ట్ లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం అన్నారు. ఆరోగ్య సేతు యాప్ ఉన్నవాళ్లనే అనుమతిస్తున్నామని…ఇప్పుడు వచ్చే వారికి పరీక్షల అనంతరమే అనుమతిస్తున్నాం అన్నారు.

ఎలాంటి కరోనా లక్షణాలు లేని వారికి 14 రోజుల క్వారన్ టైన్ లేదని…1600 మంది ఇతర రాష్ట్రాల నుండి నేడు హైదరాబాద్ కి వస్తున్నారుని…ప్యాసింజర్ లేకుంటే మాత్రమే విమానాలు రద్దు అవుతున్నాయని చెప్పారు. రేపటి నుండి మరిన్ని విమాన సర్వీస్ లు పెరిగే అవకాశం దాని దృష్టిలో పెట్టుకొని మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటాం అన్నారు.

విదేశీ విమాన సర్వీస్ టర్మీనల్ లను కూడా సందర్శించామని…ప్రభుత్వం, ఎయిర్‌పోర్ట్ అథారిటీ సూచించే సూచనలు సలహాలు ప్రతి ప్రయాణికుడు పాటించాలన్నారు. ఎవరికి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశాం అన్నారు.

- Advertisement -