ఏసీలో పాము..మీ ఇంట్లో చెక్‌ చేసుకోండి..!

692
snake in acsnake in ac
- Advertisement -

నైరుతి రుతపవనాల రాక మరింత ఆలస్యమవుతాయని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ప్రజలకు మరిన్నిరోజులు వేసవి తాపం తప్పేలా కనిపించడం లేదు. ఇక ఈ ఏడాది వేసవిలో రికార్డు స్ధాయిలో ఉష్ణోగ్రతలు నమోదుకావడంతో వందల సంఖ్యలో ప్రజలు చనిపోయారు.

ఎండవేడిమిని తట్టుకోలేక ప్రజలే కాదు జంతువులు కూడా అల్లాడిపోయాయి. వేసవి తాపం నుంచి తప్పించుకునేందుకు ఓ పాము ఏకంగా ఏసీలో దూరింది. మూడు నెలలుగా ఏసీలో ఉంది. తమిళనాడులో జరిగిన ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది.

స్థానికంగా ఉన్న సరోజానగర్‌కు చెందిన ఏలుమలై ఇంట్లోని బెడ్‌రూమ్‌లో నుంచి తరచూ శబ్దం వస్తుండటంతో మెకానిక్‌ను పిలిపించాడు. ఏసీని విప్పిచూసిన మెకానిక్‌కు రెండు పాము కుబుసాలు కనిపించడంతో షాకయ్యాడు. జాగ్రత్తగా పరిశీలించగా అందులో పాము ఉందని గుర్తించాడు.

దీంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా రెండు గంటల పాటు శ్రమించి ఆ పామును బయటకు తీశారు. ఏసీని బిగించిన సమయంలో బయటివైపు ఉన్న పైపు హోల్‌ను సరిగా మూయకపోవడంతో పాము ఏసీలోకి దూరి ఉండొచ్చని భావిస్తున్నారు. మూడు నెలలుగా ఏసీ నుంచి ఇలాంటి శబ్దాలే వస్తున్నాయని  ఏలుమలై చెబుతున్నారు. మొత్తంగా ఏసీలో పాము ఉండటం స్ధానికంగా చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -