ఉదయ సముద్రం ఎత్తి పోతలపై స్మితా సబర్వాల్ సమీక్ష..

681
Smita Sabharwal IAS
- Advertisement -

ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం పనులను ముఖ్య మంత్రి కార్యాలయం కార్యదర్శి స్మితా సబర్వాల్ మంగళవారం పరీశీలించారు.బ్రాహ్మణ వెల్లంల వద్ద ప్రాజెక్ట్ సర్జి పూల్,పంప్ హౌజ్ పనులు ఇంఛార్జి కలెక్టర్ వి.చంద్ర శేఖర్, సాగు నీటి పారుదల శాఖ ఈ.ఎన్.సి.మురళీధర్ రావు, ఎన్. ఎస్.పి., ఏ.యం.ఆర్.పి.సి.ఈ., ఎస్.ఈ., లు,డి.ఈ. లు,ఆర్.డి.ఓ,తహశీల్దార్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా సి.ఈ.నరసింహ పనుల ప్రగతి వివరిస్తూ.. సర్జిపూల్,పంప్ హౌజ్ పనులు పూర్తీ చేసినట్లు, లైనింగ్ పనులు కూడా 90 శాతం పూర్తి అయినట్లు,సర్జి పూల్ లైనింగ్ చేయవలిసి ఉందని వివరించారు. అనంతరం ఉదయ సముద్రం రిజర్వాయర్ డెలివరీ మెయిన్ పనులు పరిశీలించారు.

అనంతరం ఆమె ఈ.ఎన్ సి.మురళీధర్ రావు,ఇంఛార్జి కలెక్టర్ వ్.చంద్ర శేఖర్ తో కలిసి సి.ఈ.,ఎస్ ఎస్.ఈ.,ఈ.ఈ.,లు, డి.ఈ.లు,అర్. డి.ఓ.లు,ఎస్ డి.సి.,లతో 12వ బెటాలియన్‌లో సమావేశ మందిరంలో ఉదయ సముద్రం ఎత్తి పోతల పథకం పనులు ప్రగతి, భూ సేకరణపై సమీక్షించారు. బ్రాహ్మణ వెళ్ళంల (ఉదయ సముద్రం) రిజర్వాయర్ ద్వారా ఎడమ,కుడి మెయిన్ కెనాల్ ల ద్వారా లక్ష ఎకరాలకు నీరు అందించేందుకు నిర్మిస్తున్న ఉదయ సముద్రం ఎత్తి పోతల పథకం పనులు వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు.

Smita Sabharwal

ఎడమ,కుడి మెయిన్ కెనాల్ కాల్వల భూసేకరణ 3880 ఎకరాలకు గాను 1349 ఎకరాలు భూ సేకరణ పూర్తి కావచ్చినట్లు,టన్నల్ పనులు10.625 కి.మీ లకు గాను 4 కి.మీ.లు లైనింగ్ పూర్తి చేసినట్లు,ప్రభుత్వం నుండి నిధులు పెండింగ్ లో నున్నట్లు అధికారులు కలెక్టర్ కు వివరించారు. టన్నల్ లైనింగ్ పూర్తి చేయుటకు ఒక సంవత్సరం కాలం పడుతుందని ఏజెన్సీ కాంట్రాక్టర్ తెలిపారు. చేసిన పనులకు పెండింగ్ బిల్లులు విడుదల చేస్తామని,టన్నెల్ లైనింగ్ పనులు వేగంగా పూర్తి చేయాలని సన్ బీమ్ ఏజెన్సీ ని ఆదేశించారు.

కాల్వల భూ సేకరణ స్పెషల్ డ్రైవ్ చేపట్టి పూర్తి చేయాలని,సర్వే,ఇంజనీరింగ్ అధికారులు,రెవెన్యూ అధికారులు సమన్వయంతో పని చేయాలని,ఎస్ ఎస్.ఈ.,భూ సేకరణ పర్యవేక్షించాలని,కాల్వల భూసేకరణ రిక్విజి షన్ వెంటనే సర్వే పూర్తి చేసి జిల్లా కలెక్టర్ కు సమర్పించాలని ఆదేశించారు. వచ్చే ఖరీఫ్ పంటలకు కనీసం 40 చెరువులు నింపి ఆయకట్టు రైతుల పొలాలకు నీళ్ళు పారించాలని,ఇందుకు రిజర్వాయర్ ను నీటితో నింపాలని స్మితా సబర్వాల్,సాగు నీటి పారుదల శాఖ ఈ.ఎన్.సి.,మురళీధర్ లు ఉదయ సముద్రం ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో ఇంచార్జిజిల్లా కలెక్టర్ తో పాటు ఎన్. ఎస్.పి.,ఏ.ఎం.ఆర్.పి.సి.ఈ. వి.నర్సింహ,ఆర్.డి.ఓ జగదీశ్వర్ రెడ్డి,అర్. డి.ఓ.లు జగన్నాథ రావు,లింగ్యా నాయక్, ఏ.ఎం.ఆర్.పి.ఎస్.ఈ. సాయి బాబా,ఈ ఈ. బుచ్చి రెడ్డి,డిప్యూటీ ఈఈ యాదన్ కుమార్,డి.ఈ.వి టలేశ్వర్, ఏ. ఈ.అంజనీ దేవి,నల్గొండ తహశీల్దార్ నాగార్జున,నార్కట్ పల్లి తహశీల్దార్ రాధ తదితరులు పాల్గొన్నారు.

CMO Additional Secretary Smita Sabharwal Sudden Inspection On Udaya Samudram Project Works..

- Advertisement -