ఆరుగురు మంత్రుల ప్రమాణస్వీకారం

236
New Ministers

రాజ్ భవన్ లో కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం ముగిసింది. గవర్నర్ తమిళ్ సౌ సౌందరరాజన్ సమక్షంలో ఆరుగురు మంత్రులు ప్రమాణం చేశారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌ కుమార్‌ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ మొదట హరీశ్ రావుతో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు.

ప్రమాణస్వీకారం అనంతరం మంత్రి హరీశ్ రావు సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ కేటీఆర్ తో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు. ఆ తర్వాత సబితాఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్‌, పువ్వాడ అజయ్‌ కుమార్‌ తో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించారు. రాజ్ భవన్ లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు.

satyavati

gangula