ఐ.టి వినియోగంలో సింగరేణి దేశంలోనే టాప్‌

385
Singareni
- Advertisement -

సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ బొగ్గు ఉత్పత్తి, టర్నోవర్‌ వంటి విషయాల్లోనే కాక ఐ.టి. (ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజి) వినియోగంలో దేశంలోని ప్రభుత్వ సంస్థలన్నింటికీ ఆదర్శ ప్రాయంగా ఉంటోందనీ, దశాబ్దాల క్రితమే ఐ.టి.కి పునాదులు వేసిన సింగరేణి నేడు అన్ని విభాగాల్లో ఐ.టి.ని. వినియోగిస్తూ అగ్రస్థానంలో నిలిచిందని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మైన్స్‌ సేఫ్టీ శ్రీ ఆర్‌.సుబ్రహ్మణియన్‌ ప్రశంసించారు.హైద్రాబాద్‌ లోని విశ్వేశ్వరయ్య భవన్‌ లో నేడు నిర్వహించిన ‘‘మైనింగ్‌ లో ఐ.టి. వినియోగం – ముందడుగు’’ అనే సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా కోల్‌ ఇండియా కంపెనీలు, ఎన్‌.ఎం.డి.సి, తదితర పరిశ్రమల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు డైరెక్టర్‌ (ఇ&ఎం) శ్రీ ఎస్‌.శంకర్‌ అధ్యక్షత వహించారు.

దేశంలో ఐ.టి.ని. అన్ని విభాగాల్లోనూ అమలు జరిపిన తొలి కంపెనీ సింగరేణి అని, అలాగే రానున్న కాలంలో మరింతగా ఐ.టి. వినియోగాన్ని విస్తృతపరుస్తూ, అత్యాధునిక టెక్నాలజీతో ఉత్పత్తులు సాధిస్తూ, 2024 నాటికి 100 మిలియన్‌ టన్నుల లక్ష్యం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను’’. అని డి.జి.ఎం.ఎస్‌. శ్రీ సుబ్రహ్మణియన్‌ అన్నారు. ఐ.టి.లో సింగరేణి ఒక్కటే ముందుకుపోతే సరిపోదనీ, సింగరేణితో సంబంధం ఉన్న ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు సంస్థలను కూడా తనతో పాటు ముందుకు తీసుకెళ్లాలనీ, మొబైల్‌ సేవలను మరింతగా వాడుతూ రక్షణ పెంపుదలకు కృషి చేయాలనీ పిలుపునిచ్చారు. సదస్సు ప్రారంభానికి ముందు సింగరేణి సంస్థపై ఏర్పటుచేసిన ఫోటో గ్యాలరీని ఆయన ప్రారంభించారు. సింగరేణిలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ పరిణామల క్రమం మరియు వివిధ ఐ.టి. సంబంధిత అంశాలతో రూపొందించిన ప్రత్యేక సావనీర్‌ ను ఆయన విడుదల చేశారు. సింగరేణి డైరెక్టర్లు, డైరెక్టరేట్‌ ఆఫ్‌ మైన్స్‌ సేఫ్టీ అధికారులు, ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌ ఇండియా ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు.

డైరెక్టర్‌ ఆపరేషన్స్‌ శ్రీ ఎస్‌.చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. దేశంలో బొగ్గు పరిశ్రమ గట్టి పోటీని ఎదుర్కోబోతోందనీ, తక్కువ వ్యయంతో పూర్తి రక్షణతో, మహిళా కార్మికులు కూడా బాగా పనిచేయగలిగే విధంగా కొత్త ఐ.టి. సహిత సాంకేతిక పరిజ్ఞానానికి బాటలు వేయాలని పిలుపునిచ్చారు. సింగరేణిలో ఐ.టి. వ్యవస్థాపక, నిర్వాహణ అధికారుల్లో ప్రముఖుడైన డైరెక్టర్‌ (ప్రాజెక్ట్స్‌ & ప్లానింగ్‌) శ్రీ బి.భాస్కరరావు మాట్లాడుతూ బొగ్గు తవ్వకంలో ఆధునిక పద్ధతులు వస్తున్న నేపథ్యంలో ఐ.టి. వాడకాన్ని మరింతగా విస్తృత పరచాల్సినఅవకాశం ఉందనీ, దీనికి అనుగుణంగా సింగరేణి అడుగులు వేస్తోందన్నారు. మొబైల్‌ ద్వారా ఐ.టి. సేవలు మరింతగా వాడుకోవడానికి పథకాలు రూపొందిస్తున్నామని వివరించారు. డైరెక్టర్‌ ఫైనాన్స్‌ శ్రీ ఎన్‌.బలరాం మాట్లాడుతూ సింగరేణి నేడు సాధిస్తున్న అద్భుతమైన ప్రగతి వెనుక ఐ.టి. సహకారం ఎంతో ఉందని, అన్ని విభాగాల్లో ఉన్న ఐ.టి. సేవలను మరింత విస్తృత పరుస్తామని చెప్పారు. ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌ తెలంగాణా రాష్ట్ర ఛైర్మన్‌ డా॥ జి.రామేశ్వర్‌ రావు మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రానికే తలమానికంగా నిలుస్తున్న సింగరేణి సంస్థ ఉత్పత్తి, ఉత్పాదకతు సాధించే క్రమంలో ఇన్‌ ఫర్మేషన్‌ టెక్నాలజీని విస్తృత స్థాయిలో వినియోగించుకోవడం అభినందనీయమన్నారు. సభకు అధ్యక్షత వహించిన డైరెక్టర్‌ (ఇ&ఎం.) శ్రీ ఎస్‌.శంకర్‌ మాట్లాడుతూ, 1200 మెగావాట్ల సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలోని 35 వేలకు పైగా పనులను, విభాగాలను ‘‘ప్లాంటు సిస్టం’’ ద్వారా ఐ.టి.కి అనుసంధానం చేశామనీ, అలాగే గనుల్లో యంత్రాల వినియోగం. నిర్వహణ మొత్తం మానిటరింగ్‌ మాడ్యూల్‌్గతో నిర్వహిస్తున్నామని, ఇది ఎంతో మేలు చేస్తోందన్నారు.

మందమర్రిలో నిర్మించిన అత్యాధునిక అంతర్జాతీయ స్థాయి, ఎస్‌.ఎం.టి.సి./ రక్షణ శిక్షణా సంస్థను ఈ సదస్సు నుండి వీడియో కాన్పరెన్సులో డి.జి.ఎం.ఎస్‌. శ్రీ ఆర్‌.సుబ్రహ్మణియన్‌ స్విచ్‌ ఆన్‌ చేసి ప్రారంభించారు. సింగరేణి ఆధునీకతకు ఈ రిమోట్‌ ప్రారంభోత్సవం నిర్వహించడం హర్షణీయమని, ఆయన ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా ఎస్‌.ఎం.టి.సి. పైన, సింగరేణిలో రెండు దశాబ్దాల ఐ.టి. చరిత్రపైన లఘు వీడియో చిత్రాలను ప్రదర్శించారు.

- Advertisement -