బొగ్గు ఉత్పత్తిపై సింగరేణి సీఎండి సమీక్ష..

467
Singareni Chairman
- Advertisement -

హైద్రాబాద్ సింగరేణి భవన్‌లో శుక్రవారం (ఆగష్టు 2వ తేదీ) నాడు సంస్థ ఛైర్మన్ అండ్‌ ఎం.డి. ఎన్.శ్రీధర్ సంస్థ డైరెక్టర్లు, ఏరియా జనరల్ మేనేజర్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ ఏడాది కొత్త ఓపెన్‌కాస్ట్ గనుల నుండి బొగ్గు ఉత్పత్తి ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కిష్టారం ఓపెన్‌కాస్ట్, కె.టి.కె. ఓ.సి.-3, జి.డి.కె.-5 ఓ.సి., కోయగూడెం ఓ.సి.-3, ఇందారంఖని ఓ.సి.లను ప్రారంభించి సకాలంలో బొగ్గు ఉత్పత్తి జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే నైనీ బొగ్గు బ్లాకు (ఒడిస్సా)లో జరుగుతున్న ఎక్స్ ప్లోరేషన్ పనులు, ప్రభుత్వ అనుమతులపై కూడా సమీక్షిస్తూ వచ్చే ఏడాది ఇక్కడి నుండి బొగ్గు ఉత్పత్తి జరగాలని అందుకు సన్నాహాలను పూర్తి చేయాలని ఆదేశించారు.

జూలై నెల వరకు సాధించిన వృద్ధిపై ఆయన సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఏరియాల వారీగా సాధించాల్సిన లక్ష్యాలపై సమీక్ష నిర్వహించారు. సింగరేణి కాలరీస్ కంపెనీ ఈ ఆర్ధిక సంవత్సరం జూలై నెలతో ముగిసిన నాలుగు నెలల కాలంలో గత ఏడాది ఇదే కాలానికి సాధించిన దానిపై బొగ్గు ఉత్పత్తిలో 17 శాతం వృద్ధిని, రవాణాలో 3 శాతం వృద్ధి, ఓ.బి. తొలగింపులో 6 శాతం వృద్ధిని సాధించింది.

సింగరేణి సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో జూలై నెల వరకు 190 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయగా 17 శాతం వృద్ధితో ఈ ఏడాది 222 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. అలాగే గత ఏడాది ఇదే కాలానికి 214 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేయగా ఈ ఏడాది 3 శాతం వృద్ధితో 220 లక్షల టన్నులో బొగ్గు రవాణా జరిపింది. గత ఏడాది జూలై నాటికి 117.7 మిలియన్ క్యూబిక్ మీటర్లు ఓవర్ బర్డెన్ (ఓ.బి.) తొలగించిన కంపెనీ ఈ ఏడాది 6 శాతం వృద్ధితో 124 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఓ.బి.ని తొలగించింది.

ఈ ఏడాదికి నిర్దేశించుకొన్న లక్ష్యాల ప్రకారం పరిశీలిస్తే సింగరేణి సంస్థ జూలై నాటికి ముగిసిన 4 నెలల కాలంలో నిర్దేశిత లక్ష్యాలను దాటి విజయపథంలో ముందుకు సాగుతోంది. జూలై నాటికి బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 210 లక్షల టన్నులు కాగా కంపెనీ 104 శాతం వృద్ధితో 222.2 లక్షల టన్నులో బొగ్గు ఉత్పత్తి సాధించింది. నెల వారీగా చూస్తే జూలై నెలలో గత ఏడాది కన్నా బొగ్గు ఉత్పత్తిలో 16 శాతం, రవాణాలో 13 శాతం, ఓ.బి. తొలగింపులో 38.8 శాతం వృద్ధిని నమోదు చేసింది.

ఈ సమావేశంలో ఆయనతో పాటు డైరెక్టర్ (ఇ&ఎం) ఎస్.శంకర్, డైరెక్టర్ (ఆపరేషన్స్ మరియు పా) ఎస్.చంద్రశేఖర్, డైరెక్టర్ (ఫైనాన్స్) ఎన్.బలరాం, ఇ.డి. కోల్ మూమెంట్ జె.ఆల్విన్. అడ్వయిజర్ మైనింగ్ డి.ఎన్.ప్రసాద్, జి.ఎం. (సి.డి.ఎన్.) ఆంటోనిరాజా, జి.ఎం.మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ కె.వి. రమణమూర్తి, జనరల్ మేనేజర్ (సి.ఎం.) కె.రవిశంకర్, జనరల్ మేనేజర్ ఎస్టేట్స్ ఎస్.డి.ఎం. సుభాని, జనరల్ మనేజర్ (ఓ.సి. మైన్స్) వై.జి.కె.మూర్తి, జనరల్ మేనేజర్ (యం.యస్.) ఎ.ఋష్యేంద్రుడు, జి.ఎం. (ఐ&పి.యం.) డి.రాంచందర్, జి.ఎం. ఎన్విరాన్మెంట్ జె.వి.ఎల్.గణపతి, అన్ని ఏరియాలో జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు.

- Advertisement -