మొక్కలు నాటిన భూపాలపల్లి అదనపు ఎస్పీ శ్రీనివాసులు

278
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమానికి కొనసాగింపుగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించన గ్రీన్ ఛాలెంజ్ కు విశేష్ మైన స్పందన వస్తోంది. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా భూపాలపల్లి  అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు మొక్కలు నాటారు. భూపాలపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో మూడు మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..హరిత తెలంగాణే లక్ష్యంగా ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ 4కోట్లు దాటిందన్నారు. 10కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా ఈరోజు తాను మూడు మొక్కలు నాటినట్లు తెలిపారు.

Singareni

భూమి పై విపరీతమైన ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి ఇలాంటి పరిస్ధితుల్లో మనం మొక్కలు నాటాల్సిన అవసరం ఉందన్నారు. ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని మొక్కలు నాటాలని కోరారు. ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించాల్సిందిగా మరో ముగ్గురికి సవాల్ విసురుతున్నట్లు తెలిపారు. సింగరేణి నిరీక్షణ రాజు, కేటీపీపీ సిద్దయ్య, స్థానిక డిఎస్పి సంపత్ రావు లకు ఈ సవాల్ ను స్వీకరించాల్సిందిగా కోరారు.

- Advertisement -