నాగ్‌ని వణికిస్తున్న సూర్య ..!

227
singam 3 tension for nag
- Advertisement -

సంక్రాంతి ఇచ్చిన ఊపుతో ఫిబ్రవరిలో కూడా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తోంది. గతవారం రిలీజైన నాని నేను లోకల్ రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతుంది. నేను లోకల్‌కు పోటినిచ్చే సినిమా లేకపోవడం హిట్ టాక్ రావటంతో నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మూవీగా నిలిచింది. బీ, సీ సెంటర్లలో మంచి కలెక్షన్లతో దూసుకుపోతున్నాడు నాని. అయితే, నానికి బ్రేక్ వేసేందుకు సై అంటూ ముందుకువస్తున్నారు నాగ్, సూర్య. నాగార్జున ఓం నమో వెంకటేశాయతో ఈ నెల 10న వస్తుండగా సూర్య సింగం 3తో 9న ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు.

అయితే నాని సినిమా ఇప్పటికే లాభాల్లో నడుస్తుండగా నాగ్‌కి సూర్య టెన్షన్ పట్టుకుంది.ఇప్పటికే నాలుగు సార్లు వాయిదా పడినా ఈ సినిమా మీదా ప్రేక్షకులకు భారి అంచానాలే ఉన్నాయి. ఓం నమో వెంకటేశాయ కలెక్షన్స్‌ను సూర్య కొల్లగొట్టడం ఖాయమంటూ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ మూవీ ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో రూ. 18 కోట్ల బిజినెస్ చేసింది.ఇక ప్రపంచ వ్యాప్తంగా విడుదల కు ముందే 100 కోట్ల బిజినెస్ చేసిందని నిర్మాత జ్ఞానవేల్ రాజా ప్రకటించారు. డిస్ట్రిబూటుర్ హక్కులు, సినిమా శాటిలైట్ హక్కుల అమ్మకం ద్వారా ఈ సినిమా విడుదలకు ముందే నిర్మాతకు లాభాలు సాధించి పెట్టింది.

దీంతో నాగ్‌తో పాటు చిత్రయూనిట్ టెన్షన్‌లో మునిగిపోయిందట. అయితే కాస్త ఊరట కలిగించే అంశం ఏంటంటే ఓం నమో వెంకటేశాయ రూ.47.25 కోట్ల ప్రీ- రిలీజ్ బిజినెస్ చేయడం. దీనికి తోడు నైజాం ఏరియా హక్కులను దిల్ రాజు తీసుకోవటంతో చిత్రయూనిట్ కాస్త ఉపిరి పిల్చుకుంది. తమిళ హీరో సూర్య నటించిన సింగం సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు మొదటి రెండు సినిమాలకు కొనసాగింపుగా వస్తున్న సింగం 3 సినిమా ఫిబ్రవరి 9 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -