హరీష్ రావు చేసిన పనికి హ్యాట్సాఫ్ చెబుతున్న ప్రజలు..

284
harish Rao
- Advertisement -

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన రూటే సపరేటు. రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు హరీష్. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అడుగుజాడల్లో నడుస్తూ రాష్ట్ర అభివృద్ది కోసం ఎంతగానో కష్టపడుతున్నాడు. ఇక హరీష్ రావు అంటే మనకు గుర్తుకు వచ్చేది సిద్దిపేట. సిద్దిపేట అభివృద్ది చెందింది అంటే దానికి కారణం హరీష్ రావే అని చిన్న పిల్లలు కూడా చెబుతారు. ఇందుకు నిదర్శనం మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలే అని చెప్పుకోవాలి.

రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ సాధించి రికార్డు సృష్టించారు. తాజాగా ఆయన చేసిన పనికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు సిద్దిపేట ప్రజలు. సిద్దిపేట పట్టనంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే హరీష్ రావు. హరీష్ రావు గారి ఆలోచన…ఆయన ఎం ఆదేశించినా ఆచరణలో చూపెడ్తామ్ అన్నట్టుగా సిద్దిపేట నాయకులు ప్రజాప్రతినిధులు ఉంటారని మరో సారి రుజువు చేశారు సిద్దిపేట కౌన్సిలర్. వేసవి కాలంలో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఇబ్బంది పడుతున్న ప్రయాణికులకు ఎండ నుంచి ఉపశమనం కలిగించారు.

ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ప్రయాణికులకు ఎండ తగలకుండా పైన ఒక క్లాత్ ను కట్టారు. దీంతో ప్రజలకు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద కాసేపు సేద తీరుతున్నారు. హరీష్ రావు గారు చెప్పగానే చేసిన కౌన్సిలర్ దీప్తి నాగరాజు కు ధన్యవాదాలు తెలుపుతున్నారు ప్రయాణికులు. ఇలాంటి క్లాత్ ను రాష్ట్రంలోని అన్ని చోట్లా అమలయ్యేలా చూడాలని విజ్నప్తి చేస్తున్నారు ప్రజలు.

- Advertisement -