జూనియర్ ఫిల్మ్ ఆర్టిస్ట్ ఐలవేని రామకృష్ణ అరెస్ట్..

471
siddipet police
- Advertisement -

అంతర్ జిల్లా స్ధాయిలో దొంగతనాలకు పాల్పడుతున్న జూనియర్ ఫిల్మ్ ఆర్టిస్ట్ ఐలవేని రామకృష్ణని అరెస్ట్ చేశారు సిద్దిపేట జిల్లా పోలీసులు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సీపీ జోయల్ డేవిస్ మాట్లాడుతూ మద్యం, జూదం, రేసింగ్ వంటి అలవాట్లకు బానిసై ఈజీ మనీ కోసం చోరీలకు అలవాటు పడ్డాడని తెలిపారు.

2005 నుంచి హన్మకొండ, కాజీపేట, కరీంనగర్, సంగారెడ్డి, చైతన్యపురి, ఎల్బీనగర్, హైదరాబాద్, సిద్దిపేట ప్రాంతాల్లో నిందితుడు చోరీలకు పాల్పడ్డారని తెలిపారు. నిందితుడి నుంచి సిద్దిపేట జిల్లాలో 21 కేసుల్లో నగదు, బంగారు, వెండి ఆభరణాలకు సంబంధించి మొత్తం 14 లక్షల ప్రాపర్టీ రికవరీ చేశామన్నారు.

ఈ నెల 14న ప్రజ్ఞాపూర్ వద్ద అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. జిల్లాలో గత రెండు నెలల వ్యవధిలో 52 కేసులకు సంబంధించి 44 లక్షల రూపాయల విలువ చేసే నగదు, నగలు స్వాధీనం చేసుకున్నాం అన్నారు.

Siddipet CP Joyal Devis on media meet. siddipet police arrested junior artist,theif ramakrishna.

- Advertisement -