ఆర్ఆర్ఆర్ మూవీలో శ్రియ!

444
shriya
- Advertisement -

బాహుబలి తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కథానాయకులు . ఎన్టీఆర్‌ సరసన ఒలీవియా మోరిస్‌, చరణ్‌ సరసన ఆలియా భట్‌ నటిస్తున్నారు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా..ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో కనపించనున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈమూవీని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

కాగా ఈమూవీలో శ్రియ కూడా నటిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వికారాబాద్ అడవుల్లో అజయ్ దేవగణ్, శ్రియలపై సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారని తెలిసింది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రాన్ని జులైలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఛత్రపతి’ సినిమాలో శ్రియ నటించిన సంగతి తెలిసిందే.

- Advertisement -