రివ్యూలు బాధించాయి..సాహో చూడలేదు:శ్రద్ధా

427
shradda kapoor

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సాహో. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సినిమా కావడంతో హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉండగా విడుదల తర్వాత మిక్స్‌ డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే వసూళ్ల పరంగా సాహో ఎక్కడా తగ్గలేదు. ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు సమాచారం.

సినిమా విడుదలై ఇన్ని రోజులు అవుతున్న తాను మాత్రం చూడలేదని తెలిపారు సాహో భామ శ్రద్దా కపూర్. డబ్బింగ్ ప్రాసెస్‌లో కొన్ని సీన్స్‌ మాత్రమే చూశానని …ఇప్పుడు బిగ్ స్క్రీన్‌పై సినిమా చూస్తానని మీడియాకు వెల్లడించింది.

సాహోతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చానని తెలిపిన శ్రద్దా… సినిమా రివ్యూలు బాధించాయని చెప్పుకొచ్చింది. రివ్యూలు ఎలా ఉన్న ప్రేక్షకులు మాత్రం సాహోని చూసి ఎంజాయ్ చేశారని వెల్లడించింది. సాహో హిందీ వెర్షన్‌ వసూళ్లలో సత్తాచాటిందని..సాహోలో నటించడం గొప్ప అనుభూతి అని…షూటింగ్ జరుగుతున్న సేపు ప్రతీ సీన్‌ని ఎంజాయ్ చేశానని తెలిపింది.