RRR మూవీకి ఆమె పారితోషికం ఎంతో తెలుసా..?

278
- Advertisement -

300 కోట్లతో బడ్జెట్ భారీ ఎత్తున తెరకెక్కుతున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. టాలివుడ్.. బాలివుడ్ స్టార్స్.. భారీ సెట్టింగులు.. ఇలా త్రిబుల్ ఆర్ మూవీ.. అందరిలోనూ ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ మల్టీ స్టారర్‌లో ఎన్టీఆర్.. చరణ్ కథానాయకులుగా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది.

Bollywood actress Alia Bhatt

ఈ సినిమాను వివిధ భాషల్లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉండటం వలన, ఆయా భాషలకి చెందిన నటీనటులను ఎంపిక చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే చరణ్ సరసన నాయికగా అలియా భట్ ను తీసుకున్నారు. త్వరలోనే ఆమె ఈ సినిమా షూటింగులో పాల్గొననుంది.

అయితే ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం ఆలియాకు అందే పారితోషికం ఎంత అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.. కాగా తాజాగా అందిన సమాచారం ప్రకారం ఆమెకి ముట్టజెప్పే పారితోషికం 5 కోట్లు అని తెలుస్తోంది. అలియా భట్ సంబంధించిన అన్ని ఖర్చులు కాకుండా ఆమె పారితోషికం 5 కోట్లుగా ఫిక్స్ చేశారని సినీ వర్గాల టాక్‌. మన టాలీవుడ్‌లో ముగ్గురు స్టార్ హీరోయిన్స్‌కి ఇచ్చే పారితోషికం ఇది. అలియా భట్ క్రేజ్ మామూలు లేదు మరి.

- Advertisement -