సోనాలిబింద్రేను కిడ్నాప్‌ చేయాలనుకున్న పాక్‌ క్రికెటర్‌..

119

ఒకప్పటి బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో సోనాలిబింద్రే ఒకరిగా వెలుగొందింది. తన అందచందాలతో, నటనతో వరుస హిట్లందుకుంది. ఈ అమ్మడు టాలీవుడ్‌లో కూడా మహేష్‌ బాబు, చిరంజీవి, బాలయ్య, నాగార్జున, శ్రీకాంత్‌లకు జోడీగా ఆమె నటించింది. కొంత కాలం క్రితం క్యాన్సర్ బారిన పడిన ఆమె… ఇటీవలే అమెరికాలో చికిత్స పొంది, సురక్షితంగా బయటపడింది.

Shoaib Akhtar

ఇక అసలు విషయం ఏంటంటే.. సోనాలిబింద్రే గురించి పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. సోనాలి అంటే తనకు ఎంతో ఇష్టమని… ఆమె ఫొటోను పర్సులో పెట్టకుని తిరిగేవాడినని చెప్పాడు. ఆమెకు లవ్ ప్రపోజ్ చేయాలనుకున్నానని. ఒకవేళ ఆమె ఒప్పుకోకపోతే కిడ్నాప్ చేయాలని అనుకున్నానని సరదాగా కామెంట్‌ చేశాడు.