వరల్డ్ కప్ కు ధావన్ గుడ్ బై…

122
shikhar-dhawan

ప్రపంచకప్ లో తొలి రెండు మ్యాచ్ లలో అద్భుతంగా విజయం సాధించిన టీం ఇండియాకు షాక్ తగిలింది. ఇండియా ఓపెనర్ బ్యాట్స్ మెన్ శిఖర్ ధావన్ కు వేలుకి గాయం అయింది. దివారంనాడు ఆస్ట్రేలియా జరిగిన మ్యాచ్ సందర్భంగా ధావన్ గాయపడ్డాడు. ఎడమచేతి బొటనవేలికి ఫ్యాక్చర్ అయినట్టు స్కానింగ్ లో తేలింది. ఈ నేపథ్యంలో మూడు వారాల పాటు జట్టుకు ధావన్ దూరమవుతున్నాడు.

దీంతో, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, వెస్టిండీస్, ఇంగ్లండ్ లతో జరగనున్న మ్యాచ్ లను ధావన్ లేకుండానే టీమిండియా ఆడనుంది. ఇక ధావన్ స్థానంలో శ్రేయాస్ అయ్యర్ లేదా రిషబ్ పంత్ కి ఛాన్స్ దొరికే అవకాశం ఉండగా… ఓపెనర్ గా కేఎల్ రాహుల్ వచ్చే అవకాశం ఉంది. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ధావన్ సెంచరీ చేసి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.