సెల్యూట్‌ ‘షీ టీమ్స్’@ ఐదేళ్లు

736
she teams
- Advertisement -

టీ సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన షీ టీమ్స్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రిమినల్ రేటును తగ్గించడమే కాకుండా దేశ వ్యాప్తంగా అందరి మన్నలను పొందుతుంది.రెండేళ్లలో షీ టీమ్స్ చేసిన ఆపరేషన్లు మహిళల భద్రతకు రక్షణ కవచంగా మారింది. షీ టీమ్స్ నిర్వహించిన విధులు దేశ వ్యాప్తంగా హైదరాబాద్ మహిళలకు అత్యంత సురక్షితమైన ప్రాంతంగా చాటి చెప్పింది. దేశంలోనే తెలంగాణను రెండో స్థానంలో నిలబెట్టింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మహిళల భద్రత కోసం ముఖ్యమంత్రి కే . చంద్రశేఖర్‌రావు ప్రత్యేకంగా షీ టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. షీ టీమ్స్ 2014, అక్టోబర్ 24వ తేదీ నుంచి తమ విధులను ప్రారంభించాయి.

ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చడంలో సఫలీకృతమైనట్టు భావిస్తున్నామని ఏసీపీ స్వాతి లక్రా ఆనందం వ్యక్తం చేశారు.మహిళల రక్షణ కోసం జంటనగరాల్లో ఏర్పాటుచేసిన షీటీమ్స్ వల్ల గత రెండేళ్లలో మహిళలపై నేరాలు 20 శాతం మేర తగ్గాయని చెప్పారు. ఐదేళ్ల కాలంలో షీ టీమ్స్ పనితీరు, దానిపై ప్రజల్లో అవగాహన ఎలా ఉందనే విషయంపై స్వచ్ఛంద సంస్థలతో సర్వేలు చేయిస్తూ నివేదికలు తెప్పించుకుంటూ, దాని పనితీరుకు మరింత మెరుగులు దిద్దుతూ నగరంలో మూల మూలకు వెళ్లి ఈవ్‌టీజర్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. వేధింపులకు గురయ్యే మహిళలు తమకు షీ టీమ్స్ అండగా ఉన్నాయనే ధీమాను వారిలో కల్గించగల్గుతున్నారు.

online news portal

హైదరాబాద్ సిటీలో షీ టీమ్స్ పై ఇప్పటి వరకు 76శాతం మంది జనాభాకు అవగాహన ఉన్నట్టు ఓ ప్రైవేట్ సంస్ధ నిర్వహించిన సర్వేలో వెల్లడైనట్టు పోలీసులు చెప్పారు.

online news portal

100కు డయల్ చేయడంతో పాటు ఈ మెయిల్స్, ఇతర సోషల్ మీడియా ద్వారా కూడా మహిళలు ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందిస్తామని చెబుతున్నారు. షీ టీమ్స్ వచ్చిన తర్వాత మహిళలపై 20శాతం నేరాలు తగ్గాయన్నారు సీపీ స్వాతి లక్రా. షీ టీమ్స్ తో మహిళలపై వేధింపులు బాగా తగ్గడంతో ఇతర రాష్ట్రాల్లోనూ దీన్ని అమలు చేసేందుకు… అక్కడి అధికారులు వచ్చి స్టడీ చేశారన్నారు స్వాతి లక్రా.

online news portal

- Advertisement -