రివ్యూ : శతమానం భవతి

269
Shatamanam Bhavati review
- Advertisement -

ఉత్తమ కుటుంబ కథా చిత్రాల నిర్మాత గా పేరున్న దిల్ రాజు నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శర్వానంద్ హీరో గా తెరకెక్కిన చిత్రం శతమానం భవతి. సంక్రాంతికి కలిసొచ్చిన కుటుంబ కథా చిత్రాల ట్రెండ్‌ను నమ్ముకుని అ…ఆ ఫేమ్ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా వేగేశ్న సతీష్ దర్శకత్వం లో ఈ చిత్రం తెరకెక్కింది. సంక్రాంతి కానుకగా నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఇప్పటికే సంక్రాంతి కానుకగా వచ్చిన ఖైదీ నెంబర్ 150,గౌతమి పుత్ర శాతకర్ణి హిట్ టాక్ సంపాదించుకోగా….భారీ అంచనాల మధ్య వచ్చిన శతమానం భవతి ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా చూద్దాం.

కథ :

ఆత్రేయపురం అనే ఊరుతో సినిమా మొదలవుతుంది. రాజుగారు (ప్రకాష్ రాజ్), జానకమ్మ (జయసుధ) దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. విదేశాలకు వెళ్లిన వీరి పిల్లలు అక్కడే స్ధిరపడి పోతారు. తమను చూడడానికి కూడా రాని పిల్లల కోసం రాజు గారు(ప్రకాష్ రాజ్‌) కలత చెందుతుంటారు. ఈ క్రమంలో ఓ ప్లాన్ వేసి పిల్లలంతా సంక్రాంతికి సొంతూరికి వచ్చేలా ప్లాన్ వేస్తాడు. సీన్ కట్ చేస్తే…సొంతూరి వచ్చిన ప్రకాష్‌ రాజ్ మనవరాలు నిత్యా(అనుపమ పరమేశ్వరన్‌) బావ రాజు(శర్వానంద్‌) ప్రేమలో పడుతుంది. ఇంతలో ప్రకాష్ రాజు వేసిన పథకం జానకమ్మకు తెలియడంతో పెద్ద గొడవ జరుగుతుంది.. ఇంతకి తన పిల్లలని ఆత్రేయపురానికి రప్పించడానికి రాజు గారు వేసిన ప్లాన్ ఏంటీ? తర్వాత ఏం జరుగుతుంది.. ?రాజు, నిత్యా కలుస్తారా.. ? అన్నదే సినిమా కథ.

Shatamanam Bhavati review

ప్లస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కథ. తాను ఎంచుకున్న కథని సైడ్ ట్రాక్ పట్టుకుండా చక్కని ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌గా తెరకెక్కించడంలో దర్శకుడు సతీష్ వందశాతం సక్సెస్ సాధించాడు. ప్రేక్షకులను రంజింప చేశేలా ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కట్టిపడేశాడు. వరుస హిట్ సినిమాలతో మంచి ఊపు మీదున్న శర్వానంద్ మరోసారి తన మార్క్ నటనతో ఆకట్టుకున్నాడు. అనుపమ పరమేశ్వరన్ తన పాత్రలో ఒదిగిపోయింది. సినిమాలో కీ రోల్ పోషించిన ప్రకాష్ రాజ్, జయసుధ నటన సినిమాకు మరో ప్లస్‌. మిగితా నటీనటులు పర్వాలేదనిపించారు. కుటుంబ కథా చిత్రమైన వీలైనంతా కామెడీని జోడించి నవ్వించే ప్రయత్నం చేశారు.

మైనస్ పాయింట్స్ :

సెకండాఫ్‌లో వేగం తగ్గడం సినిమాకు మైనస్ పాయింట్. కొన్ని సన్నివేశాలు బోరింగ్‌గా లేకున్నా, ఫ్యామిలీ సినిమా ఫార్మాట్‌లో సాగిపోవడంతో చప్పగా అనిపిస్తుంది. అక్కడక్కడా స్లోగా సాగే కథతో కాస్త బోర్ కొట్టిస్తుంది. కొన్ని చోట్ల కావాలని ఇరికించిన కామెడీ సన్నివేశాలు అంతగా ఆకట్టుకోలేదు.

సాంకేతిక విభాగం :

కుటుంబ కథా చిత్రాన్ని చిన్న ట్విస్ట్‌తో నడిపించిన దర్శకుడు సతీష్ ప్రతిభను మెచ్చుకోవాల్సిందే. అనవసరమైన అంశాల జోలికి పోకుండా కాస్త కామెడీ జోడించి ఆడియన్స్‌కు నచ్చేలా సినిమాను తెరకెక్కించాడు. మిక్కీ జే మేయర్ సంగీతం బాగుంది. పాటలు బాగున్నాయి. గ్రామీణ వాతావరణాన్ని చక్కగా కళ్లకు కట్టించినట్లు చూపించిన సినిమాటో గ్రాఫర్ సమీర్ రెడ్డి మంచి మార్కులే కొట్టేశాడు. ఎడిటింగ్ ఫర్వాలేదు. దిల్ రాజు నిర్మాణ విలువలు బాగున్నాయి.

Shatamanam Bhavati review

తీర్పు :

విదేశాల్లో స్థిరపడిపోయి ఇంటిని మరిచిపోయిన పిల్లలు, వారిని చూడాలని రోజూ కలలు కనే తల్లిదండ్రుల బాధలు, కుటుంబ విలువలను చెబుతు తెరకెక్కించిన సినిమానే శతమానం భవతి. కథ, సరదాగా నవ్వించే కామెడీ సినిమాకు ప్లస్ కాగా అక్కడక్కడా నెమ్మదించిన కథనం మైనస్ పాయింట్స్‌. టీజర్,ట్రైలర్‌తోనే మంచి రెస్పాన్స్ సాధించి సంక్రాంతి బరిలో నిలిచిన మూడో హిట్ సినిమా…. చక్కని ఫ్యామిలీ ఎంటర్ టైనర్ శతమానం భవతి

విడుదల తేదీ : 14/01/ 2017
రేటింగ్ : 3.5/5
నటీనటులు : శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్
సంగీతం : మిక్కీ జే మేయర్
నిర్మాతలు : దిల్‌రాజు
దర్శకత్వం : వేగేశ్న సతీష్

- Advertisement -