ప్రపంచంలో డబ్బుతో కొనలేనిది.. డబ్బు ఒకటే..రణరంగం ట్రైలర్(వీడియో)

424
Ranarangam Trailer
- Advertisement -

శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ తెరకెక్కించిన చిత్రం రణరంగం. గ్యాంగ్ స్టర్ డ్రామాగా ఈచిత్రాన్ని చిత్రికరించారు. శర్వా సరసన కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ లు హీరోయిన్లుగా నటించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈమూవీ ఈనెల 15న విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈచిత్రం టీజర్, ఫస్ట్ లుక్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. తాజాగా ఈచిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది.

ఈ కార్యక్రమానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిధిగా వచ్చి ..ఈమూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ ఆధ్యంతం యాక్షన్, లవ్ సీన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. శర్వా రెండు డిఫరెంట్ పాత్రల్లో నటిస్తుండగా.. 90వ దశకం నాటి యదార్ధ సంఘటనలు ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఈ ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

- Advertisement -