జగన్‌కు శరద్ పవర్‌ ఫోన్..ఎందుకో తెలుసా..!

74
jagan sharad pawar

ఏపీలో జగన్ అధికారంలో రానున్నాని అన్ని సర్వేలు కుండబద్దలు కొట్టడంతో ఆయన మద్దతు కోరేందుకు రంగంలోకి దిగింది కాంగ్రెస్‌. అయితే ఇప్పటికే 23న జరిగే ఎన్డీయేతర పక్షాల సమావేశానికి హాజరుకావాలని సోనియా లేఖ రాయగా జగన్ ఏ నిర్ణయం తీసుకోలేదు.

ఈ నేపథ్యంలో జగన్‌కు ఆదివారం ఓ కాంగ్రెస్ సీనియర్ నేత ఫోన్ చేసి మద్దతివ్వాలని కోరగా తాజాగా ఎన్సీపీ చీఫ్ శరద్ పవర్ ..జగన్‌కు ఫోన్ చేసి సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతివ్వాలని కోరారు. ఫలితాలు వచ్చాక మాట్లాడుకుందామని జగన్‌ చెప్పినట్లు తెలుస్తోంది.

మరోవైపు ఏపీలో ఎవరుగెలుస్తారనే దానిపై జోరుగా బెట్టింగ్ సాగుతోంది. టీడీపీ గెలిస్తే లక్షకు లక్షన్నర.. అదే జగన్ సీఎం అయితే లక్షకు రెండున్నర లక్షలు ఇస్తామంటూ ఏపీలో భారీ ఆఫర్లు నడుస్తున్నాయి. బ్రోకర్ల ఆఫర్లకు టెంప్ట్ అవుతోన్న బెట్టింగ్ రాయుళ్లు కోట్ల రూపాయల్లో పందేలు కాస్తున్నారు. ఒక్క గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇప్పటికే 200 కోట్లు చేతులు మారినట్లు తెలుస్తోంది.