శివసేనతో కలవం..ప్రజాతీర్పే ఫైనల్‌:పవార్

542
sharad power
- Advertisement -

మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటమిని అంగీకరించారు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆయన శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే ప్రసక్తే లేదన్నారు. ప్రజా తీర్పను తాము గౌరవిస్తామని…ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని చెప్పారు. ఎన్సీపీ మెరుగైన స్ధానాలు దక్కించుకుందని మా భవిష్యత్ కార్యాచరణపై మిత్రపక్షాలతో చర్చిస్తాం అన్నారు.

ఎన్సీపీని వీడిన వారందరు ఓటమి పాలయ్యారని చెప్పారు. వారికి ఫిరాయింపులు ఏ మేలు చేయలేకపోయాయని తెలిపారు. అధికారంలో ఉన్న వారి అహంకారాన్ని ప్రజలు ఉపేక్షించబోరని ఈ ఫలితాలు తెలుపుతున్నాయని వ్యాఖ్యానించారు.

కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 102, శివసేన 61 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఆ ఇరు పార్టీలు కలిపి 163 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఎన్సీపీ 54, కాంగ్రెస్ 41, స్వతంత్ర అభ్యర్థులు 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. శివసేన సీఎం పదవి తమకే ఇవ్వాలని పట్టుబడుతున్న నేపథ్యంలో 50-50 ఫార్ములా తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. సీఎం పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాలని బీజేపీ- శివసేన అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది.

- Advertisement -