షాహిద్ కపూర్‌తో మృణాల్ ఠాకూర్..!

604
shahid kapoor
- Advertisement -

గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో నాని హీరోగా తెరకెక్కిన చిత్రం జెర్సీ . బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టిన ఈ మూవీతో నాని తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ మూవీ బాలీవుడ్‌లో రీమేక్ కానుండగా అర్జున్‌ రెడ్డి రీమేక్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. తెలుగులో జెర్సీ మూవీని తెరకెక్కించిన గౌతమ్ హిందీలో కూడా తెరకెక్కించనున్నారు.

ఇక ఈ సినిమాకు సంబంధించి మరో అప్ డేట్ వచ్చేసింది. షాహిద్‌కు జోడిగా సూపర్ 30,బాల్తా హౌస్‌ చిత్రాల్లో నటించి మెప్పించిన మృణాల్ ఠాకూర్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో షాహిద్ క్రికెటర్‌గా కనిపించనుండటంతో ఇప్పటికే ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేశారు.

అమన్‌ గిల్‌తో కలిసి అల్లు అరవింద్, దిల్‌ రాజు నిర్మించనుండగా 2020 ఆగస్టు 28న విడుదల కానుంది.ఇక ఈ సినిమా కోసం షాహిద్‌ కపూర్‌ ఏకంగా రూ. 40 కోట్ల రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Shahid Kapoor is all set to star as a cricketer in his next film titled ‘Jersey’. The Kabir Singh actor recently welcomed his co-star Mrunal Thakur

- Advertisement -