మనకు ఏ మతం లేదు.. ఉండకూడదు- షారుక్‌

322
sharukh

బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్ ఖాన్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఈ దేశంలో షారుఖ్‌కి ఉన్న ఫ్యాన్స్‌ మరెవ్వరికి లేదు అంటూ ఆయన అభిమానులు సగర్వంగా చెబుతూ ఉంటారు. షారుఖ్‌ సినిమాలు చేసినా.. చేయకున్న ఆయనపై మా అభిమానం ఏమాత్రం తగ్గదంటూ ఆయన అభిమానులు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. అంతటి అభిమానులను కలిగి ఉన్న షారుఖ్ ఖాన్ తాజాగా రిపబ్లిక్ డే సందర్బంగా జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాటలు ఇప్పుడు సంచనంగా మారాయి.

sharukh family

ఈ సందర్భంగా షారుక్‌ తన కూతురు అడిగిన ప్రశ్నకు ఏం సమాధానమిచ్చాడో చెప్పిన వీడియో ఇపుడు వైరల్‌గా మారింది. నా కూతురు సుహానా స్కూల్‌లో చేరుతున్నపుడు మతానికి సంబంధించిన కాలమ్‌లో ఏం పెట్టాలని నాన్న అడిగింది. అపుడు ఆ కాలమ్‌లో నేను ఇండియన్‌ అని రాశాను. మనకు ఏ మతం లేదు..ఉండకూడదు. సుహానాతోపాటు ఆర్యన్‌, అభిరామ్‌కు మన మతం హిందూస్తాన్‌ అని చెప్పానని షారుక్‌ అన్నాడు. హిందువు, ముస్లిం అంటూ ఏమీ లేదు. నా భార్య హిందువు. నేను ముస్లిం. నా పిల్లలు భారతీయులు. ఇది వాస్తవం..అని షారుక్‌ చెప్పుకొచ్చాడు.