గ్రీన్ ఛాలెంజ్ ..మొక్కలు నాటిన సినీ నటి అమల

390
amala Akkineni green
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ ఉద్యమంలా సాగుతుంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించారు సినీ నటి అమల. ఈ రోజు తన నివాసంలో 5మొక్కలు నాటారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్ధను ఆమె అభినందించారు.

ఈసందర్భంగా అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షాలు తెలుపుతూ కొత్త సంవత్సరంలో అందరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ కు అభినందనలు తెలిపారు. ఈ గ్రీన్ ఛాలెంజ్ సవాల్ ను స్వీకరించాల్సిందిగా మరో నలుగురికి సవాల్ విసిరారు.   1) ఉపాసన కొణిదెల 2 )వసంత వాడి జంతుసంరక్షకురాలు 3)హీరా రూపానీ 4)BCH Team.

- Advertisement -